cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బన్నీ హీరోయిన్ ను దేవరకొండ ఆదుకుంటాడా?

బన్నీ హీరోయిన్ ను దేవరకొండ ఆదుకుంటాడా?

త్వరలోనే బన్నీ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో దేవరకొండ చేయబోతున్న సినిమాలో క్యాథరీన్ థ్రెసాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

బన్నీ నటించిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది క్యాథరీన్. కానీ ఆ క్రేజ్ ను అలానే కొనసాగించలేకపోయింది. మధ్యలో చిరంజీవి సినిమాలో ఐటెంసాంగ్ ఛాన్స్ కూడా ఇలా వచ్చి అలా చేజారిపోవడంతో సినిమాల పరంగా క్యాథరీన్ అనాథగా మిలిగింది. ఎట్టకేలకు ఆమెకు విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ దక్కింది.

విజయ్ సరసన అర్జున్ రెడ్డిలో నటించిన షాలినీ పాండే మంచి పేరు తెచ్చుకుంది. ఇక విజయ్ తో కలిసి గీతగోవిందం సినిమా చేసిన రష్మిక ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా విజయ్ తో కలిసి టాక్సీవాలా సినిమా చేసిన ప్రియాంక జవాల్కర్ కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది.

సో.. క్రేజ్ లేక అల్లాడుతున్న తనకు కూడా దేవరకొండ కలిసొస్తాడని భావిస్తోంది క్యాథరీన్.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?