cloudfront

Advertisement


Home > Movies - Movie News

డీసెంట్ గా ప్రారంభమైన కమర్షియల్ 'యాత్ర'

డీసెంట్ గా ప్రారంభమైన కమర్షియల్ 'యాత్ర'

యాత్ర... అందరి హృదయాల్ని హత్తుకుంది. మనసుల్ని కదిలించింది. హార్ట్ టచింగ్ మూవీగా పేరుతెచ్చుకుంది. మరి కమర్షియల్ సక్సెస్ సంగతేంటి? కమర్షియల్ గా కూడా ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్లు 26 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తక్కువ బడ్జెట్ లో తీశారు యాత్ర సినిమాను. బయ్యర్లకు కూడా చాలా తక్కువ మొత్తాలకు ఇచ్చారు. రికార్డు సంఖ్యలో థియేటర్లు అంటూ గొప్పలు చెప్పుకోకుండా డీసెంట్ నంబర్ లో సినిమాను వదిలారు. అటుఇటుగా 12 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టే.

మొదటిరోజు వసూళ్లతో సినిమా కమర్షియల్ సక్సెస్ పై యూనిట్ తో పాటు బయ్యర్లకు నమ్మకం పెరిగింది. పైగా సినిమాకు కంప్లీట్ పాజిటివ్ టాక్ రావడంతో త్వరలోనే యాత్రకు స్క్రీన్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో క్రమక్రమంగా వసూళ్లు మరింత పెరగొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక ఏపీ, నైజాంలో ప్రాంతాల వారీగా ఈ సినిమాకు మొదటిరోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – 0.62 కోట్లు
సీడెడ్ – 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.14 కోట్లు
ఈస్ట్ – 0.10 కోట్లు
వెస్ట్ – 0.16 కోట్లు
గుంటూరు – 0.46 కోట్లు
కృష్ణా – 0.19 కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!