cloudfront

Advertisement


Home > Movies - Movie News

యాత్ర నిడివి 1.57

యాత్ర నిడివి 1.57

దారిచూడు, తెన్ను చూడు మామా అంటూ కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సీమ రచయిత పెంచలదాస్. ఆ తరువాత అరవింద సమేత సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. లేటెస్ట్ గా వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా కోసం పెంచలదాస్ చేత ఓ మాంచి భావోద్వేగ గీతాన్ని రాయించారు.

సినిమా క్లయిమాక్స్ లో వచ్చే ఈ గీతం అద్భుతంగా వుంటుందన్నది యూనిట్ వర్గాల బోగట్టా. సీమ మాట, సీమ యాస, అన్నీ కలబోసి మాంచి ఎమోషనల్ గా సాగే ఈ గీతాన్ని పెంచలదాస్ తానే రాసి, ఆలపించాడట.

సినిమా చివర్లో వచ్చే ఈ పాట వైఎస్ అభిమానుల చేత కంటతడి పెట్టిస్తుందని, ముఖ్యంగా సీమ వాసులను టచ్ చేస్తుందని యూనిట్ భావిస్తోంది. ఇదిలావుంటే యాత్ర సినిమా నిడివి గంటా యాభై ఏడు నిమిషాలు మాత్రమే. అంటే చాలా క్రిస్ప్ గా వుంటుందన్నమాట.

సినిమా మొత్తం రెడీ అయిపోయి, పైనల్ కట్ ని ఫిక్స్ చేయగా 1.57 నిమిషాలు వచ్చిందని తెలుస్తోంది.

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?