Advertisement


Home > Movies - Movie News
‘యాత్ర’ టీజర్.. మిలియన్ వ్యూస్‌ను దాటేసీ..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన టీజర్ వ్యూస్ విషయంలో దూసుకుపోతోంది. వైఎస్ జయంతి సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. కొన్ని గంటల్లోనే అది యూట్యూబ్‌లో పదిలక్షల వ్యూస్‌ను సంపాదించుకోవడం విశేషం. ఇప్పుడు అది పన్నెండు లక్షల స్థాయి వ్యూస్‌ను సంపాదించుకుని సాగుతోంది.

ఇవన్నీ కేవలం యూట్యూబ్ వ్యూస్. ఈ సినిమా టీజర్ పట్ల యూట్యూబ్లో కన్నా ఫేస్ బుక్‌లో, వాట్సాప్‌లో బ్రహ్మాండమైన క్రేజ్ కనిపించింది. ఫేస్‌బుక్ లో వైఎస్ అభిమానులు, వీరికి సంబంధించిన పేజీల్లో ‘యాత్ర’ టీజర్ దుమ్ము రేపింది. ఇక వాట్సాప్‌లో అనేక మంది స్టేటస్‌లో యాత్ర టీజర్ అగుపించింది నిన్నంతా. ఈ రకంగా చూస్తే ‘యాత్ర’ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గూగుల్ ట్రెండ్స్‌లో కూడా యాత్ర టీజర్ ప్రముఖంగా నిలిచింది.

ఇదంతా చూస్తుంటే ఊహించిన దాని కన్నా వైఎస్ బయోపిక్‌కు మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోందని స్పష్టం అవుతోంది. సినిమా స్టార్ల, స్పోర్ట్స్ స్టార్ల బయోపిక్స్‌కు తీసిపోని రీతిలో వైఎస్ బయోపిక్ పట్ల ఆదరణ కనిపిస్తోంది. అందులోనూ ‘పాదయాత్ర ’ కొంచెం డ్రై సబ్జెక్ట్, కష్టాలు కన్నీళ్ల గురించినే ఎక్కువగా ఉంటాయి. అయినా ‘యాత్ర’ సినిమాగా ఆసక్తిని రేపుతోంది. టీజర్ వ్యూసే అందుకు సాక్ష్యం. దాదాపు ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా సమాచారం.