Advertisement


Home > Movies - Movie News
అవును.. నేను వేస్ట్ ఫెలోనే

మనసుకు నచ్చింది సినిమాకు ప్రమోషన్ కల్పిస్తూ కొన్ని రోజుల కిందట దర్శకురాలు మంజుల నోరుజారారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, నిజంగా ఇది ఎవరికైనా నచ్చకపోతే వాళ్లు "వేస్ట్ ఫెలోస్" అనే పదం వాడారు. ఇప్పుడీ డైలాగ్ సోషల్ మీడియాలో రివర్స్ ఫైర్ అయింది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంజులను ట్యాగ్ చేస్తూ.. అవును.. నేను వేస్ట్ ఫెలోనే, నాకు సినిమా నచ్చలేదంటూ సెటైరిక్ గా ట్వీట్లు, పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. "ఈ సినిమా ఎవరికీ నచ్చలేదు.. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులంతా వేస్ట్ ఫెలోస్" అంటూ మరో ట్వీట్.

"పాపం.. మంజుల మనసును ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు" అంటూ ఫన్నీగా మరో ట్వీట్. ఇలా మనసుకు నచ్చింది సినిమాపై సోషల్ మీడియాలో ఒకటే జోకులు. "ఆవిడ నచ్చినట్టు తీసింది.. వీళ్లు వచ్చినట్టు చేశారు.. మనం చచ్చినట్టు చూడాలి.. ప్రకృతి విలయతాండవం అంటే ఇదే" అంటూ మరో పోస్ట్. ఇలా మనసుకు నచ్చింది సినిమాపై లెక్కలేనన్ని సెటైర్లు, జోకులు పుట్టుకొచ్చాయి.

నిజానికి సినిమా రిలీజ్ కు ముందు నుంచే ఇలాంటి జోకులు ఉన్నాయి. ఇప్పుడేవో కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. విడుదలకు ముందే అక్క మంజులపై తమ్ముడు మహేష్ సెటైర్ వేశాడు. అక్క దర్శకత్వంలో సినిమా చేస్తే అదే నా ఆఖరి చిత్రం అవుతుందని జోక్ చేశాడు మహేష్. అదిగో అక్కడ్నుంచి మంజులపై జోకుల పర్వం మొదలైంది.