cloudfront

Advertisement


Home > Movies - Movie News

యంగ్ నానీ వచ్చేసాడు

యంగ్ నానీ వచ్చేసాడు

నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా జెర్సీ మీద మాంచి అంచనాలు వున్నాయి. నాని కెరీర్ లో ఓ మంచి సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో సదా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ ను వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఆ అనౌన్స్ మెంట్ తో ఓ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసారు. నాని కాస్త యంగ్ లుక్ లో వున్న పోస్టర్ అది. యంగ్ లుక్ అని ఎందుకు అనడం అంటే, ఈ సినిమాలో నాని రెండు లుక్స్ తో కనిపిస్తాడు. అదికాక, బాలుడిగా కూడా కనిపిస్తాడు. ఈ మూడో క్యారెక్టర్ ను ఓ యంగ్ బాయ్ చేస్తున్నాడు. మిగిలిన రెండు క్యారెక్టర్లను నాని చేస్తున్నాడు.

వీటిలో యంగ్ లుక్ ను పోస్టర్ లో రివీల్ చేసారు. లైట్ బియర్డ్ తో పైకి దువ్విన హెయిర్ తో నాని కూల్ గా వున్నాడు ఈ పోస్టర్ లో. 'అదేంటో గానీ ఉన్నపాటుగా' అనే లీడ్ తో సాగే పాటను బుధవారం విడుదల చేస్తారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాట డిఫరెంట్ ట్యూన్ తో సాగుతుంది.