cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేశ్‌పై వైసీపీ ఫ్యాన్స్.. అదిరిపోయే పోస్టర్!

మహేశ్‌పై వైసీపీ ఫ్యాన్స్.. అదిరిపోయే పోస్టర్!

తను ఏ రాజకీయ పార్టీకి మద్దతు దారుడిని కాను అని మహేశ్ స్పష్టం చేశాడు. ఏ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయను అని మహేశ్ చెప్పాడు. సీఎంగా నటిస్తున్నారు కదా, మీకు ఇష్టమైన సీఎం ఎవరు? అని మీడియా ప్రతినిధులు అడిగినా దానికి సమాధానంగా ఏం చెబితే ఏం తలనొప్పి వస్తుందో అనే భయంతో మహేశ్ బాబు కామ్ అయ్యాడు.

అయితే మహేశ్ రాజకీయాల వద్దంటున్నా, జనాలు మాత్రం ఈ హీరోని వదిలేలా లేరు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలోని వైసీపీ ఫ్యాన్స్ మహేశ్‌ను పూర్తిగా ఓన్ చేసుకున్నారు.

ఇప్పుడు కాదనుకోండి, ఎప్పుడో కాంగ్రెస్ హయాం నుంచినే మహేశ్ బాబు సినిమా వస్తోందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కటౌట్లు కట్టే వాళ్లు. ఆ తర్వాత ఆ పరంపర వైసీపీ వాళ్లు బాధ్యతగా తీసుకున్నారు.

మహేశ్ బాబును బాగా ఓన్ చేసేసుకుని, ఈ హీరో సినిమా వచ్చినప్పుడల్లా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’కు కూడా వైసీపీ వాళ్లు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇది అనంతపురంలోని సీన్. అక్కడి శాంతి థియేటర్లో భరత్ అనే నేను విడుదల సందర్భంగా వైసీపీ అభిమానులు ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు.