cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్.. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్

ఎక్స్ క్లూజివ్.. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు, జీ తెలుగు ప్రతినిధుల మధ్య చర్చలు  పూర్తయ్యాయి. ఓ స్టార్ హీరో సినిమాకు శాటిలైట్ రైట్స్ డీల్ ఇంత లేట్ గా జరగడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. కాకపోతే దీని వెనక చాలా పెద్ద కథ నడిచింది.

వకీల్ సాబ్ సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే జెమినీ ఛానెల్ రంగంలోకి దిగింది. దిల్ రాజుతో సూచనప్రాయంగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఛానెల్ లో అంతర్గతంగా ఏం జరిగిందో ఏమో, ఆఖరి నిమిషంలో డీల్ నుంచి సదరు ఛానెల్ తప్పుకుంది.

అలా జెమినీ తప్పుకోవడంతో జీ తెలుగు ఎంటరైంది. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. అటుఇటుగా 15 కోట్ల రూపాయలకు ఈ డీల్ జరిగినట్టు సమాచారం.

తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. 

పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకుడు. అంజలి, అనన్య, నివేత థామస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×