Advertisement


Home > Movies - Photo Feature
క్రేజీ హీరోయిన్.. టాప్ లెస్ పోజు!

కాన్సెప్ట్.. హాలీవుడ్ అమ్మమ్మల కాలం నాటిదే… పెట్ ను అడ్డం పెట్టుకుని హాట్ పోజును ఇవ్వడం. ఇప్పుడు ఆలియా వంతు వచ్చిందంతే. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఆలియాను స్టిల్ ను ఇలా ప్రజెంట్ చేశాడు. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఆలియాను టాప్ లెస్ పోజులో ఈ విధంగా నెటిజన్ల ముందు నిలిపాడు.

మరి ఈ టాప్ లెస్ పోజుపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొంతమంది నెటిజన్లేమో.. ఈ బ్లడీ బ్లాక్ క్యాట్ ను పక్కకు తీసి,ఆ పోజును ఫొటోగా తీయాల్సింది అంటుంటే, మరి కొందరేమో.. ఇందులో కొత్తేముంది? అని అంటున్నారు. మార్లిన్ మన్రో నాటి స్టిల్ అంటూ డబూ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటీవలే మరో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ని కూడా ఇలాగే టాప్ లెస్ పోజులో నిలబెట్టి స్టిల్స్ తీశారు ఈ ఫొటో గ్రాఫర్. దానికి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ మాత్రం ఫొటోలు మేం తీయలేమా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.