Advertisement


Home > Movies - Press Releases
13న ఎన్పీఎస్ థర్డ్ సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్, రెండు పాటలు ఇప్పటికి బయటకు వదిలారు. ఇప్పుడు మరో పాట వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెల 13న మూడో పాటను విడుదల చేస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ ల‌వ్ అనే  3వ సింగిల్ ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నారు, త్వ‌ర‌లోనే మిగ‌తా సింగిల్స్ విడుద‌ల చేసి, నెలాఖ‌రున గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా అత్యంత భారీగా,  గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫ‌స్ట్ ఇంపాక్ట్‌, డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెప్తున్నారు. ఈ చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది.

అల్లు అర్జున్ ని ఎప్పుడూ చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం బ‌న్ని త‌న ప్రాణం పెట్టి చేశాడ‌నేది అక్ష‌ర‌స‌త్యం. పాత్ర‌లో ఇమిడిపోవ‌డ‌మే కాకుండా డెడికేష‌న్ తో అస‌లు రియ‌ల్ మిల‌ట‌రి వాళ్ళు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని, వాళ్ళ‌ని క‌ల‌సి ఆ పాత్ర‌లో జీవించాడు.

 మే 4న ప్రేక్ష‌కులు చెప్పె మెద‌టి మాట బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించే..మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు సాంగ్స్ అటు ఆన్‌లైన్ లో కాని , కాల‌ర్‌టోన్స్ గా కాని మంచి క్రేజ్ ని సొంతం చేస‌కున్నాయి. ఇప్ప‌డు ఏప్రిల్ 13న సీతారామ‌శాస్త్రి గారు ర‌చించిన బ్యూటిఫుల్ ల‌వ్ అని సాగే 3వ సింగిల్ ని విడుదల చేస్తున్నాము. అన్ని  కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.