cloudfront

Advertisement


Home > Movies - Press Releases

21న ధ‌నుష్ మారి 2

21న ధ‌నుష్ మారి 2

ర‌ఘువ‌ర‌న్ చిత్రంతో టాలీవుడ్ లో ట్రెండి యాక్టర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న ధ‌నుష్ హీరోగా, ఫిదా, ఎం.సి.ఏ లాంటి వ‌రుస విజ‌యాల‌తో యువ హృదయాలలో ప‌ర్మినెంట్ ప్లేస్ ని కొట్టేసిన సాయిప‌ల్లవి హీరోయిన్ గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి2. ఈ చిత్రం గతంలో వచ్చిన మారి సినిమాకు సీక్వెల్.  మారి2 టీజ‌ర్స్‌, పోస్టర్స్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌టంతో ఫ్యాన్సీ రేట్లకే బ‌య్యర్స్ కొనుగొలు చేయ‌టం విశేష‌.  బాలీజీ మోహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత ధ‌నుష్, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు

ఈ చిత్రాన్ని తెలుగు లో ప‌లు చిత్రాలు పంపిణి చేసిన‌ సాయికృష్ణా ఫిలింస్ అధినేత సాయి కృష్ణ పెండ్యాల విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారి2లో ఓ సాంగ్ ని ప్రముఖ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు లెజెండ్ ఇల‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, హీరో ధ‌నుష్ మాట్లాడుతూ.. మారి చిత్రం చాలా పెద్ద స‌క్సస్ ని సాధించింది. ఇప్పడు దానికి సీక్వెల్ గా మారి2ని విడుద‌ల చేస్తున్నాము. డిసెంబ‌ర్ 21న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్స్, పోస్టర్స్ త‌మిళ‌, తెలుగు ప్రేక్షకుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

త‌ప్పకుండా ఈ చిత్రం అంద‌ర్ని అక‌ట్టుకుంటుంది. ఇళ‌య‌రాజా గారు ఓక సాంగ్ ని పాడ‌టం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే