cloudfront

Advertisement


Home > Movies - Press Releases

24న నర్తనశాల ఫ్రీరిలీజ్ ఫంక్షన్

24న నర్తనశాల ఫ్రీరిలీజ్ ఫంక్షన్

సినిమాలకు పబ్లిసిటీ చేయడంలో ఛలో సినిమాతో కొత్త పుంతలు తొక్కింది ఐరా క్రియేషన్స్. ఇప్పుడు మళ్లీ అదే ఆనవాయతీ పాటిస్తోంది రెండో సినిమా నర్తనశాలకు కూడా. సినిమా విడుదలకు దాదాపు నెలరోజులు ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి, మూడు నాలుగు రోజులకో  మీడియా ఈవెంట్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికి టీజర్, ఫస్ట్ సాంగ్, సెకెండ్ సాంగ్ విడుదల చేసింది. పైగా ఫస్ట్ సాంగ్ ను పూర్తి వీడియోగా విడుదల చేసి కొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు.

నాలుగో ఈవెంట్ గా ప్రీరిలీజ్ ఫంక్షన్ డేట్ ను, సినిమా కాన్సెప్ట్ ను రివీల్ చేసింది. సినిమాలో మహిళల శిక్షణ కేంద్రంలో హీరో నాగశౌర్య ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తాడని, మహిళలకు అన్ని రకాలైన ఆత్మరక్షణ విద్యలు నేర్పుతూ వుంటాడని వెల్లడించారు. ఈ క్రమంలో హీరో కొంతకాలం బృహన్నలగా కనిపిస్తాడని, హీరో బృహన్నలగా ఎందుకు కనిపించాల్సి వచ్చిందన్నది కీలక పాయింట్ అని వెల్లడించారు.

ఇదిలావుంటే ఈనెల 24న నర్తనశాల ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించబోతున్నట్లు నిర్మాత ఉష వెల్లడించారు. తమ ఫస్ట్ సినిమా ఛలోకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా వచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసారి మరి ఏం చేస్తారో, ఎవరిని ఆహ్వానిస్తారో చూడాలి.

సినిమా ఈనెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమర్పకుడు మాల్పూరి శంకర్ ప్రసాద్ తెలిపారు.