Advertisement


Home > Movies - Press Releases
మే 5న "బాబు బాగా బిజీ "

శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది.  నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఎ స‌ర్టిఫికేట్ పొందింది.  మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... అవ‌స‌రాల శ్రీనివాస్ చేసిన బాబు బాగా బిజీ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కించాము. ఈ చిత్రం ద్వారా  నవీన్ మేడారం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది.. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే పాపులర్ అయ్యాయి. ఇవ‌న్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చేవే అని అన్నారు.