cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఆది సాయికుమార్ సినిమా ప్రారంభం

ఆది సాయికుమార్ సినిమా ప్రారంభం

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మించే నూతన చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఆదివారం  ప్రారంభం అయ్యింది. వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్ డీసీపీ.కృష్ణ మోహన్ చేసారు.  సీనియర్ నటుడు సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేసారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ డైరెక్టర్ నాకు మూడు గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.  అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు దర్శకుడు వంశి పైడిపల్లి క్లాప్ కొట్టడం అంటే చాలా ఆనందంగా వుంది. మంచి లవ్ స్టొరీ తో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంబంధిచి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

నిర్మాత చావలి రామాంజనేయులు మాట్లాడుతూ సీమశాస్త్రి సినిమా తరువాత  ఈ సినిమా చేస్తున్నాము. బౌండెడ్ స్క్రిప్ట్ తో డైరెక్టర్ మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకు పంపిణీ రంగంలో అపార అనుభవం వున్న డీఆర్పీ వర్మ మరో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.