cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఆహ్లాదభరితంగా

ఆహ్లాదభరితంగా

 రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గుమ్మడికాయ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు సంజానారెడ్డి మాట్లాడుతూ.. "ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకత్వ అవకాశం రావడం అనేది చాలా అరుదు. నన్ను నమ్మి ఈ ఆఫర్ ను నాకు ఇచ్చిన నా నిర్మాత అనిల్ సుంకరగారికి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నాకు ఎంతగానో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్నతలు. జూన్ 1న విడుదలవుతున్న మా "రాజుగాడు" చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను" అన్నారు.

చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ""భలే భలే మగాడివోయ్" చూసి మారుతిగారిని మంచి కథ అడగ్గా.. "రాజుగాడు" కథ ఇచ్చారు. ఆ కథను సంజనా రెడ్డి అద్భుతంగా తెరకెక్కించింది. ఆమె ఈ సినిమా కోసం సంవత్సరం కష్టపడింది. జూన్ 1వ తారీఖు ఆమె జీవితంలో బిగ్గెస్ట్ డే గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ తో మళ్ళీ మరో సినిమా ఎప్పుడు తీయాలా అని ఆలోచిస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. అనిల్ కృష్ణ ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డాడు. "రాజుగాడు" మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పను కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం కడుపుబ్బ నవ్విస్తుంది" అన్నారు.

చిత్ర కథానాయకుడు రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం అనేది నాకు ఫ్యాన్ బోయ్ మూమెంట్ లాంటిది. ఈ బ్యానర్ లో నేను నటించిన 5వ సినిమా ఇది. ఈ బ్యానర్ లో ఇంకా చాలా సినిమాలు చేయాలీ. దర్శకురాలు సంజనా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నుంచి మంచి కామెడీను రాబట్టుకొంది. నా సినిమాటోగ్రాఫర్, మ్యూజీషియన్ తో ఇప్పటికే చాలా సినిమాలకి వర్క్ చేశాను. "రాజుగాడు" మంచి హోల్ సమ్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు మా చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

కథానాయకి అమైరా దస్తూర్ మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి