cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

అక్షరం మార్చకుండా తీసాం

అక్షరం మార్చకుండా తీసాం

తమిళ సినిమా రాక్షసన్ కు తెలుగు రీమేక్ రాక్షసుడు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లు. రమేష్ వర్మ దర్శకుడు. హావిష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోనేరు విద్యా సంస్థల అధినేత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తాము నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో వున్నామని, కేఎల్ యూనివర్సిటీ ఎంత ప్రాముఖ్యత గలదో అందరికీ తెలుసు అని, అయితే తన కుమారుడు హవీష్ కోసమే సినిమా రంగంలోకి ప్రవేశించానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తాను రాక్షసన్ సినిమాను తమిళ్ లో విడుదలైన వారం రోజుల్లోనే చూసానని, హవీష్ కోసం హక్కులు కొని, కానీ, అనేక కారణాల వల్ల బెల్లంకొండను ఎంచుకుని రీమేక్ చేసామని వివరించారు.

ఈ సినిమా విషయంలో డైరెక్టర్ రమేష్ వర్మకు నేను ఫస్ట్ నుండి ఒక్కటే చెప్పామని ‘రాక్షసన్’ స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం మార్చినా ఆడియన్స్ కి ఆ ఫీల్ తగ్గుతుంది. అందుకే అలానే తీయమని చెప్పి, అలాగే తీసామని వెల్లడించారు. తాము నిర్మించే ప్రతి సినిమాలో అంతర్లీనంగా ఓ మెసేజ్ వుంటుందని, అలాగే రాక్షసుడు సినిమాలో కూడా వుంటుందని కోనేరు సత్యనారాయణ వివరించారు.

ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడని ఆయన తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాకు మంచి ఛాయిస్ అయిందని అన్నారు. తాము అనుకున్నదాని కన్నా మంచి రేట్లకు బిజినెస్ పూర్తి అయిందని, డిజిటల్, శాటిలైట్ కూడా పూర్తయిపోయిందని చెప్పారు. 

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!