cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఆలియాభట్ కాదు..ఆర్య భట్ట

ఆలియాభట్ కాదు..ఆర్య భట్ట

అందరికీ ఆలియా భట్ కలలోకి వస్తే, వాడికి ఆర్యభట్ట కలలోకి వస్తుంది. ఇదీ ఒక్కమాటలో ఫస్ట్ ర్యాంక్ రాజు గురించి చెప్పేమాట. పుస్తకజ్ఞానం ఫుల్. లోక జ్ఞానం నిల్ అన్న టైపు.

కన్నడంలో పెద్ద హిట్ అయిన సినిమాను తెలుగులో ఫస్ట్ ర్యాంక్ రీమేక్ చేసారు. చేత‌న్ మ‌ద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై న‌రేష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార. మే నెలలో విడుదలయ్యే ఈ సినిమా పాటను ఆన్ లోకి విడుదల చేసారు.

హీరో క్యారెక్టర్ ను, అతగాడి బుక్ నాలెడ్జ్, లోకల్ నాలెడ్జ్ తేడాను వివరిస్తూ సాగే పాట ఇది.
పాట విడుదల సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు న‌రేష్ కుమార్ మాట్లాడుతూ   - ``క‌న్న‌డంలో నేను చేసిన ఫ‌స్ట్ ర్యాంక్ రాజు మా జీవితాల‌ను మార్చేసింది. సినిమా ఏకంగా వంద‌రోజులు స‌క్సెస్‌ఫుల్‌గా ఆడింది. నిర్మాత మంజునాథ‌ స‌పోర్ట్‌తోనే అది సాధ్య‌మైంది. ఫ‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ 1 శాతం ఉండే వాళ్ల‌కే కాదు.. మిగిలిన 99 శాతం పిల్ల‌ల‌కు కూడా న‌చ్చే సినిమా. క‌న్న‌డ‌లో ప్ర‌తి స్టూడెంట్‌, వారి త‌ల్లిదండ్రుల‌తో చూసిన సినిమా. విద్యే కాదు.. బుద్ది ఉండాల‌ని చెప్పే సినిమా. సినిమాలో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది`` అన్నారు.

హీరో చేత‌న్ మ‌ద్దినేని మాట్లాడుతూ - ``ప్ర‌తి ఫ‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్ బ‌యోపిక్ ఇది. ప్ర‌తి ఒక్క‌రూ వారి లైఫ్‌లో ఎక్క‌డో ఒక‌చోట నెంబ‌ర్ వ‌న్ అయ్యుంటారు కాబ‌ట్టి వారంద‌రి బ‌యోపిక్ ఇది. మా డైరెక్ట‌ర్ న‌రేష్‌కుమార్‌గారి క‌థ ఇది. త‌ల్లిదండ్రులంద‌రూ చూడాల్సిన సినిమా. ఒక ప‌క్క అమాయ‌కంగా, మ‌రో ప‌క్క అన్నీ తెలుసు అనేలా న‌టించే చాలెంజింగ్ పాత్ర‌లో న‌టించ‌డం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.