Advertisement


Home > Movies - Press Releases
ఆనందోబ్రహ్మకు కలెక్షన్ల ఆనందం

సినిమా విజయవంతం అయ్యింది అనడానికి కలెక్షన్సే ప్రామాణికం. సూపర్ హిట్ అయ్యిందంటే… అందరికీ లాభాలే లాభాలు. ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమా రిలీజ్ చేసిన నిర్మాతలకు, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్… ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే… ఆనందో బ్రహ్మ రిలీజ్ అయన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది.

విడుదలైన అన్నిసిటీస్ లో హౌస్‌ ఫుల్ కలెక్షన్స్, బి, సి సెంట‌ర్స్ లో 60 శాతానికి పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. రెండ‌వ రోజు, మూడ‌వ రోజు 100 క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి మెద‌టి వీకెండ్ కి 4.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ వసూలు చేసింది. సోమవారం నాడు కూడా కలెక్షన్స్ సూప‌ర్ స్ట్రాంగ్ గా వుండ‌టంతో అన్ని ఏరియాల వారు లాభాల బాట పట్టనున్నారు. 

దాదాపు మూడు కోట్ల వ్యయంతో ఆనందో బ్రహ్మ నిర్మించారు. ఇప్పటివరకు 4.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం. ఓవర్సీస్ లోనే దాదాపు 2.25 కోట్లతో దూసుకెళ్తోంది. త‌క్కువ  థియేటర్స్ లో వేసినప్పటికీ… అనుకున్న దాని కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ధియోట‌ర్స్ అనూహ్యంగా పెంచుతున్నారు.

అన్ని వర్గాల్ని మెప్పించే విధంగా దర్శకుడు మహి వి రాఘవ్ రాసిన కథ, కథనం, అందరూ మెచ్చే తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, రాజీవ్ కనకాల లాంటి ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్…. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ అందరినీ మెప్పించాయి. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే కామెడీ సీన్స్ కి ఈ మధ్య కాలంలో అంతగా నవ్వలేదని… అటు తెలుగు పరిశ్రమ సెలెబ్రిటీస్ నుంచి మారు మూల ఉండే ప్రేక్షకులు కూడా చెబుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు

ఈ సినిమా ఎంతకి ఘన విజయం సాధించిందో. దాదాపు సినిమాలో 40 నిమిషాలు దియోట‌ర్స్ లో సీట్ల‌లో కూర్చోని చూడ‌టంలేదు.. హీలేరియ‌స్ గా న‌వ్వుతూనే వున్నారు. ఈ చిత్రం ఇంకా చాలా పెద్ద రేంజి కి వెలుతుంద‌ని ట్రేడ్ లో అంచ‌నాలున్నాయి. అతిముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఈ చిత్ర విజ‌యాన్ని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని అంద‌రూ ఆనందిస్తున్నారు. ఓ చిన్న చిత్రం విజ‌యం సాధిస్తే ఇండ‌స్ట్రీ అంద‌రి స‌పోర్ట్ వుంటుంద‌నేది ఈ చిత్ర విజ‌యం మ‌రోక్క‌సారి ప్రూవ్ చేసింది.

ఓవరాల్ గా… 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి మొదటి చిత్రంగా భలే మంచి రోజు వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత రెండో చిత్రంగా నిర్మించిన హార్రర్ కామెడీ ఆనందో బ్రహ్మతో… మరోసారి బంపర్ హిట్ అందుకొని....భారీ చిత్రాలు నిర్మించే నిర్మాతల్ని సైతం... ఈ తరహా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ విత్ కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రాలు కూడా ట్రై చేయాలనే ఆలోచన పుట్టించారు. ఓవ‌ర్‌సీస్ లో దాదాపు 600k, డొమెస్టిక్ లో 25 కొట్ల గ్రాస్ చేస్తుంద‌ని అంచ‌నా.