cloudfront

Advertisement


Home > Movies - Press Releases

అందరికి నచ్చే సినిమా 'మిస్ మ్యాచ్'

అందరికి నచ్చే సినిమా 'మిస్ మ్యాచ్'

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం  'మిస్ మ్యాచ్'.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  మిస్ మ్యాచ్ చిత్ర యూనిట్  మీడియాతో సమావేశం అయి చిత్ర విశేషాలను పంచుకున్నారు .

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..."మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్.  కథ, కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో చిత్రం  విడుదల డేట్ ను ప్రకటిస్తాము అన్నారు. 

ఈ సందర్బంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..."ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను.  నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. రఫ్ రోల్ లో మీముందుకు వస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ రోజు చిన్న సినిమాగా కనిపించే ఈ మూవీ రిలీజ్ తరువాత అందరూ పెద్ద సినిమాగా ఈ సినిమా గురించి మాట్లాడతారు"అన్నారు. 

ఈ సందర్బంగా దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ..."ఈ చిత్రంలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్క్ఔట్ అయ్యింది. కొత్త కథతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు  జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నాకు బాగా సహకరించారు. మీ  అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు.

నిర్మాత భరత్ రామ్ మాట్లాడుతూ... ఈ కథ  బాగా నచ్చింది. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు" అన్నారు. నటి రూప లక్ష్మీ మాట్లాడుతూ..సక్సెస్ ఫుల్ టీమ్ కలిసి ఈ సినిమా చేశారు. సక్సెస్ సాధిస్తుందని  భావిస్తున్న అన్నారు.