cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'అనుకున్నది ఒకటి అయినది ఒకటి'

'అనుకున్నది ఒకటి అయినది ఒకటి'

జర్నలిస్ట్ బాలు అడుసుమిల్లి దర్శకుడిగా మారి అందిస్తున్న సినిమా 'అనుకున్నది ఒకటి అయినది ఒకటి' ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను బుధవారం ప్రకటిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు బాలు మాట్లాడుతూ - ``స్వతంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌ క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు

నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ నలుగురు అమ్మాయిలు సరదాగా గడుపుదామని గోవా వెళ్లి వస్తే, వారి జీవితాల్లో ఏం జరిగింది అన్నది కథ అని, అందుకే అనుకున్నది ఒకటి అయినది మరొకటి అన్న టైటిల్ ఫిక్స్ చేసామని, అది పక్కా సినిమాకు సరిపోతుందని వెల్లడించారు.

ఇదిలావుంటే ఈ సినిమా ఫుల్ గా రొమాంటిక్ టచ్ తో, అమ్మాయిల అందాల ఆరబోతతో వుంటుందని, కాస్ అడల్ట్ టచ్ వున్న సినిమాలు లైక్ చేసే వారికి నచ్చే విధంగా రూపొందించారని వినవస్తోంది. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్రసాద్ ప్రధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న

ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస,  నిర్మాత‌:  హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: బాలు.

 


×