cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఏప్రిల్ 19న కాంచ‌న‌-3

ఏప్రిల్ 19న కాంచ‌న‌-3

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల సీరిస్ తో తనకంటూ ఆ జోనర్ లో ఓ ప్రత్యేకత సృష్టించుకున్నాడు రాఘవ లారెన్స్. లేటెస్ట్ గా ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ కాంచ‌న‌-3. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. తెలుగు వెర్షన్ కు నిర్మాతగా టాగోర్ మధు వ్యవహరిస్తున్నారు. తమిళ వెర్షన్ ను సన్ టీవీ టేకోవర్ చేయడం విశేషం.

ఈ సంద‌ర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ... కాంచన 3 చిత్రం నా కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి.

ఇప్పుడు వాటికి మంచిన కథా బలంతో వస్తున్నాం. త్వరలో రిలీజ్ చేయనున్న ఆ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరతాయిని ధీమాగా చెబుతున్నాం. థమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!