cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

అశ్వధ్దామ టైటిల్ లాంచ్

అశ్వధ్దామ టైటిల్ లాంచ్

యువ హీరో నాగశౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రీన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ లాంచింగ్ కార్యక్రమం దీపావళి నాడు జరిగింది. రమణ తేజ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాకు అశ్వద్ధామ అనే టైటిల్ పిక్స్ చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ.... ఛలో సినిమా ఇచ్చిన హిట్ సెంటిమెట్ తో ఈరోజు మీడియాను కలుసుకున్నాం.  ఇప్పటివరకు నాగశౌర్య ఈ తరహా కథ, కథనంతో సినిమా చేయలేదు. అందుకే ఫస్ట్ లుక్ ను విభన్నంగా ఉండేలా ప్లాన్ చేశాం. డైరెక్టర్ రమణ తేజ అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. శౌర్య అందించిన స్టోరీకి న్యాయం చేస్తున్నాడు.

ఇప్పటివరకు టాకీ పార్ట్ పూర్తయింది. ఒక పాట బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. యాక్షన్ పార్ట్ కథ ప్రకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కెజిఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు వర్క్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. 

చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ చిత్రంతో డైరెక్టర్ గా రమణ తేజ పరిచయం అవుతున్నాడు. అమెరికాలో వర్క్ చేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నాగశౌర్య రియలిస్టిక్ స్టోరీని కథగా మలిచాడు.  దాన్ని అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు. రియలిస్టిక్ సినిమా ఇది. సాంగ్ బ్యాలెన్స్ ఉంది. చిక్ మంగుళూరులో షూట్ ప్లాన్ చేశాం. దాదాపు 30 రోజులు యాక్షన్ షూట్ చేశాం. 

దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ ఇది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. శౌర్య గారు రియల్ ఇన్సిడెంట్స్ నుంచి రాసుకున్నారు. నన్ను డైరెక్టర్ గా అనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  రాసుకున్నది రాసుకున్నట్టుగా తీశాం అనుకుంటున్నాం అన్నారు. 

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు