cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఆడియన్స్ కు హీరో నాని థాంక్స్

ఆడియన్స్ కు హీరో నాని థాంక్స్

పీల్డర్ లేని గ్రౌండ్ లో ఫోర్ కొడితే కిక్కే వుండదు అనే డైలాగు నేను లోకల్ లోని డిలీటెట్ సీన్లలో వుందని, గ్యాంగ్ లీడర్ సినిమా విజయం ఆ డైలాగును గుర్తుచేసిందని, హీరో నాని అన్నారు. గ్యాంగ్ లీడర్ విడుదల ముందు అనేక విషయాలు భయం కలిగించాయని, కానీ ముందుకే వెళ్లామని, ఇప్పుడు తొలిరోజు ఫలితంచూసాక ఆనందం కలిగిందని ఆయన అన్నారు. నిన్నటి నుంచి షోలు వరుసగా అప్ ట్రెండ్ లోనే వున్నాయని ఆయన అన్నారు.

గ్యాంగ్ లీడర్ టీమ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా నాని కూడా మాట్లాడారు. ఇప్పటిదాకా తాము మాట్లాడామని ఇప్పుడు సినిమా మాట్లాడుతోందని నాని అన్నారు. సినిమాను ఇంతగా ఓన్ చేసుకున్న ఆడియన్స్ కు ఆయన థాంక్స్ చెప్పారు. సినిమా రిలీజైనప్పడి నుండి సోషల్‌ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని, ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరు కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్‌ కామెడీని మెచ్చుకుంటున్నారని చెప్పారు.

నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని, తొలిరోజు కన్నా మలిరోజు థియేటర్లు పెరగడం విశేషణ అని. ప్రతి ఒక్కరు థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అన్నారు.

దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ మాట్లాడుతూ - '' మీరందరూ చూపిస్తున్న లవ్ అండ్ కేర్ కి థాంక్స్. అందరూ థియేటర్స్‌లో మాత్రమే సినిమా చూడండి'' అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్‌ సి.ఇ.ఓ.చిరంజీవి(చెర్రీ) మాట్లాడుతూ - ''ఎవరి నోట విన్నావన్‌ వర్డ్‌ రివ్యూ 'సినిమా చాలా బాగుంది' అని. నిన్న ఫస్ట్‌ షో, సెకండ్‌ షోకి అన్ని థియేటర్స్‌ ఫుల్‌ అవడమే కాకుండా ఈరోజు మార్నింగ్‌ షో కూడా చాలా ఫాస్ట్‌గా ఫిల్‌ అయ్యాయి. సినిమాను ఇంతలా ఓన్‌ చేసుకొని యాక్సెప్ట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

హీరోయిన్ ప్రియాంక, హీరో కార్తికేయ, సినిమాటోగ్రాఫర్ క్యూబా తదితరులు కూడా ఈ సమావేళంలో పాల్గొన్నారు.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?