cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

దొర‌సానికి అవార్డులొచ్చాయ్!

దొర‌సానికి అవార్డులొచ్చాయ్!

అంతా కొత్త వాళ్ల‌తో రూపొందిన సినిమాలు అరుదుగా వ‌స్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అయ్యే రేట్ త‌క్కువే. అలా ఫ‌ర్వాలేద‌నిపించుకున్న సినిమా 'దొర‌సాని'. ఈ సినిమా హీరో, హీరోయిన్, ద‌ర్శ‌కుడు అంతా కొత్త వాళ్లే.

గ‌త ఏడాది విడుద‌ల అయిన ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ హీరోగా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది జీవిత-రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక‌.

వీళ్లిద్ద‌రూ జీ సినీ అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు. వీరితో పాటు ఈ సినిమా పాట‌ల ర‌చ‌యిత‌ల‌కూ ఆ అవార్డులు ద‌క్కాయి. అలాగే అంతా కొత్త వాళ్ల‌తో రూపొందిన సినిమాగా దీనికి ప్ర‌త్యేక అవార్డును కూడా ఇచ్చింది జీ నెట్ వ‌ర్క్.