cloudfront

Advertisement


Home > Movies - Press Releases

బృందావనమది అందరిదీ వీడియో విడుదల

బృందావనమది అందరిదీ వీడియో విడుదల

జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై  తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల, ప్రభాకర్ రెడ్డి   నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బృందావనమది అందరిది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న సందర్భంగా సింపుల్ వీడియో విడుదల చేశారు ఈ సందర్బంగా దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ చిత్రం కోసం వైజాగ్ సాగర తీరం లో వేయించిన హీరోయిన్ హోమ్ సెట్ సన్నివేశాలు, అలాగే  వైజాగ్ పరిసర ప్రాంతాలలో రిచా పనాయ్,  హర్షవర్ధన్ రాణే, ఎంపీ శివ ప్రసాద్ తదితరులతో కీలక సన్నివేశాలు చిత్రీకరించామన్నారు.  ఔట్ ఫుట్ చాలా బాగా వస్తోందని,  పూర్తి సంతృప్తగా వుందని,  అన్నారు.

మిగతా షెడ్యూల్ ఏప్రిల్ 1 నుండి బెంగళూర్ లో వారం రోజులు షూట్ చేసి, ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది అని ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ సీపాన తెలిపారు.