cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కెరీర్ బెస్ట్ ఫిలిం ఇదే-భీమినేని

కెరీర్ బెస్ట్ ఫిలిం ఇదే-భీమినేని

'శుభమస్తు'  చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి 'శుభాకాంక్షలు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా చెరగని ముద్రవేశారు భీమినేని శ్రీనివాసరావు. లేటెస్ట్‌గా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రల్లో  ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు.

''..మా చిత్రం  'కౌసల్య కృష్ణమూర్తి' విడుదలై మూడు రోజులు అవుతుంది. నాకు ఈ సినిమాకు వచ్చినన్ని అప్రిసియేషన్‌ కాల్స్‌ మరే సినిమాకు రాలేదు.  చాలా మంది కాలేజ్‌ స్టూడెంట్స్‌ ఫోన్‌ చేసి మా స్టూడెంట్స్‌ అందరికి ఒక ఇన్స్పిరేషన్‌లా ఉందని అంటున్నారు. - కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి గారు వారి కుటుంబసభ్యులతో కలిసి  సినిమా చూసి, యూనిట్ ను పిలిచి, ప్రత్యేకంగా అభినందించారు.

కెరీర్‌ స్టార్టింగ్‌లో 'శుభాకాంక్షలు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' లాంటి మంచి సినిమాలు చేసినా... మంచి కాన్సెప్ట్‌ దొరకడం కష్టం అవుతున్న ఈ మధ్యకాలంలో  'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి ఒక గొప్ప సినిమా దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్‌ బెస్ట్‌ ఫిలిమ్‌.

ఇది ఒక ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీ. ఒక క్రికెటర్‌గా ఎదుగుతూనే ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఎమోషన్‌ చూపించిన సినిమా. అలాగే దానికి ప్యారలల్‌గా రైతుల సమస్యలను చూపించడం జరిగింది. అన్ని ఎమోషన్స్‌ని అండర్‌ కరెంట్‌ ప్యాకేజీలా స్క్రీన్‌ప్లే నడిపిన సినిమా ఇది. స్క్రీన్‌ ప్లే ప్రతి ఒక్కరికి నచ్చడంతో పాటు ఎమోషన్స్‌కి అందరు కనెక్ట్‌ అవుతున్నారు'' అని భీమినేని అన్నారు.

నేను స్కూల్‌, కాలేజ్‌ డేస్‌ నుండే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవానడిని ఆ అనుభవంతో సినిమా మీద ఫ్యాషన్‌తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. నటుడిగా చేయాలంటే కొంత భయం వేసి టెక్నీషియన్‌ గా చేరడం జరిగింది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌ 'అశ్వద్ధామ' సినిమాలో ఒక క్యారెక్టర్‌ చేశాను. అలాగే ఆర్‌ నారాయణమూర్తి 'ఆలోచించండి' సినిమాలో సెకండ్‌ హీరోగా చేశాను. ఈ మధ్య కాలంలో 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో తండ్రి క్యారెక్టర్‌ చేశాను,

'కెరటం'లో ఒక మంచి సినిమా క్యారెక్టర్‌ చేశాను. తరువాత 'కౌసల్య క ష్ణమూర్తి 'లో బ్యాంకు మేనేజర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్‌ రోల్‌ అయినా మంచి కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్‌ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు భీమినేని శ్రీనివాసరావు.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..