cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కెరీర్ మళ్లీ మొదలైంది-బెల్లంకొండ

కెరీర్ మళ్లీ మొదలైంది-బెల్లంకొండ

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో  కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. `రాక్ష‌సుడు` ట్రైల‌ర్‌ను నారాయ‌ణదాస్ నారంగ్ విడుద‌ల చేశారు. తొలి టికెట్‌ను హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. తొలి టికెట్‌ను త‌ల‌సాని సాయి యాద‌వ్ కొన్నారు. ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.  ఈ సంద‌ర్భంగా ..

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``సాయిని చిన్న‌ప్ప‌ట్నుంచి చూస్తున్నా.. హీరోగా ఎద‌గడానికి ప్ర‌తి సినిమాకు కొత్త ద‌నాన్ని ప్ర‌య‌త్నిస్తూ ఈస్థాయికి చేరుకున్నాడు. రాక్ష‌సుడు త‌న 7వ సినిమా. ఈ సినిమాతో ర‌మేశ్ వ‌ర్మ స‌క్సెస్ రైడ్ మ‌ళ్లీ మొద‌లు కావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 

మంత్రి త‌ల‌సాని సాయి యాద‌వ్ మాట్లాడుతూ - ``బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమా ద్వారా అంద‌రికీ మంచి పేరు, నిర్మాత‌ల‌కు మంచి డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. `` అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - ``అల్లుడు శీను` ఐదేళ్ల క్రితం విడుద‌లైంది. అభిమానుల ప్రేమ‌, స‌పోర్ట్‌తోనే ఇంత దూరం రాగ‌లిగాను. రాక్ష‌సుడు సినిమా విష‌యానికి వ‌స్తే.. నాకు ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఇష్ట‌మైన సినిమా.   ఇంకా మీ ప్రేమ, ఆద‌ర‌ణ పొంద‌డానికి ఇంకా క‌ష్ట‌ప‌డ‌తాను. ఇప్ప‌టి నుండి మ‌న కెరీర్ స్టార్ట్ అయ్యింది. రాక్ష‌సుడు నా మొద‌టి సినిమా. రెండో సినిమా కోసం వెయిట్ చేయండి. నాకు స‌పోర్ట్ చేసిన కుటుంబ స‌భ్యులు, స్నేహితులకు థ్యాంక్స్‌`` అన్నారు. 

నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ''...ఈ సినిమాకు క‌థే మూలం. ఇలాంటి కంటెంట్ నాలుగేళ్లుగా సౌతిండియాలోనే రాలేదు. క‌థ‌ను బేస్ చేసుకునే టైటిల్‌ను కూడా పెట్టాం.  సినిమా చాలా ఉద్విగ్నంగా ఉంటుంది.  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో టాప్ టెక్నీషియ‌న్స్‌ను తీసుకున్నాం. సినిమాటోగ్రాఫ‌ర్‌గా వెంక‌ట్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా జిబ్రాన్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ప‌నిచేశారు. మేకింగ్ అస‌లు కాంప్ర‌మైజ్ కాలేదు. రీషూట్స్ కూడా చేశాం.'` అన్నారు.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!