Advertisement


Home > Movies - Press Releases
ఛలో సెన్సార్ పూర్తి

నాగశౌర్య లేటెస్ట్ మూవీ సెన్సార్ కార్యక్రమం పూర్తయింది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. వాస్తవానికి క్లీన్ యు సర్టిఫికెట్ రావాల్సిందే. కానీ క్లయిమాక్స్ లో వున్న చిన్న ట్విస్ట్ తదితర సన్నివేశాల కారణంగా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు.

ఇటీవలి కాలంలో క్లీన్ ఎంటర్ టైనర్ చూసామని సెన్సారు సభ్యులు ప్రశంసించారని ఆయన తెలిపారు. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మణిశర్మ కుమారుడు స్వరసాగర్ అందించిన రీరికార్డింగ్ సినిమాకు బాగా ప్లస్ అయిందని అన్నారు. పాటల్లో రెండింటికి ఊహించనంత స్పందన వచ్చిందన్నారు.

సినిమాను పిబ్రవరి 2న విడుదల చేస్తునట్లు నిర్మాత ఉష మాల్పూరి చెప్పారు . నాగశౌర్య కెరీర్ లో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న సినిమాగా, హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా చలో నిలుస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేసారు.

ఎక్కడా రాజీ పడకుండా హయ్యస్ట్ బడ్జెట్ తో సినిమా నిర్మించామన్నారు. ఈ మధ్యకాలంలో ఓ మీడియం బడ్జెట్ మూవీకి ఇంత భారీగా పబ్లిసిటీ చేసిన క్రెడిట్ తమకే దక్కిందన్నారు.