cloudfront

Advertisement


Home > Movies - Press Releases

చిన్న సినిమాకు క్రేజీ డీల్

చిన్న సినిమాకు క్రేజీ డీల్

ఆర్జీవీ దగ్గర చిరకాలం పనిచేసిన అజయ్ భూపతి డైరక్షన్ లో నిర్మాత గుమ్మంకొండ అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిన్న సినిమాకు ఈ మధ్య కాస్త బాగానే బజ్ వచ్చింది. టీజర్, ట్రయిలర్ లు అన్నీ బయటకు వచ్చి జనాల్లో కాస్త ఆసక్తిని కలిగించాయి. అలనాటి హీరో రాంకీ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

దీంతో ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ కింద సురేష్ రెడ్డి, వినోద్ రెడ్డి రెండు కోట్లు ఎనభై లక్షలకు తీసేసుకున్నారు. ఇదికాక బెంగుళూరును ఈగిల్ ఎంటర్ ప్రైజెస్, ఓవర్ సీస్ ను కంట్రీ సైడ్ పిక్చర్స్ తీసుకున్నారు. ఇంకా శాటిలైట్ వుండనే వుంది.

చిన్నచిత్రంగా నిర్మించిన ఈ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ కావడంపట్ల నిర్మాత అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తంచేస్తూ, సినిమా విజువల్స్, ఫోటోగ్రఫీ అన్నీ రిచ్ లుక్ లో వుంటాయని, లొకేషన్లు, ఫొటోగ్రఫీ కలిసి సినిమాకు మాంచి లుక్ తెచ్చాయని, ఫస్ట్ కాపీ చూసి, అవుట్ రేట్ గా రెండు రాష్ట్రాలకు ఒక్క సంస్థనే కొనుగోలు చేయడం చాలా ఆనందంగా వుందని అన్నారు.

అజయ్ భూపతి డైరక్షన్, స్క్రిప్ట్, అన్నీ జనాలకు బాగా నచ్చుతాయని, కచ్చితంగా కొన్నాళ్లు థియేటర్లలో వుండే సినిమాగా ఆర్ ఎక్స్ 100 వుంటుదని ఆయన అన్నారు. రామ్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 12న విడుదలకు రెడీ అవుతోంది.