cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్

చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. ఈ  చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష  హీరోయిన్‌గా నటిస్తోంది. `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో హీరో శివ కందుకూరి మ్యారేజ్ ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆగస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

నేష‌న‌ల్ అవార్డ్ విన్నర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.