cloudfront

Advertisement


Home > Movies - Press Releases

క్లినికల్ ట్రయిల్స్ పై మార్షల్

భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనిషి ధైర్యంగా నమ్మి అప్పగించేది డాక్టర్ కే....అన్న లైన్ తో తయారైన సినిమా మార్షల్. ఎవిఎల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అభ‌య్ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, అభ‌య్ త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రానికి జైరాజాసింఘ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

ఈ సినిమా టీజర్ ను ఆదివారం విడుదల చేసారు. మెడిక‌ల్‌, యాక్ష‌న్‌సైంటిఫిక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం టీజ‌ర్‌ విడుదల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త‌వారు వ‌స్తే అంత కొత్త క‌థ‌లు వ‌స్తాయి. మార్షల్ టీజర్ చూస్తుంటే అభ‌య్ తీసిన మొద‌టి చిత్రంలా లేదు. అంత బాగుంది. చిన్న సినిమాల‌కు ప్ర‌మోష‌న్ ఎంతో అవ‌స‌రం అంద‌రం చిన్న సినిమాల‌ను ఆద‌రించాలి. మార్ష‌ల్ చిత్రం మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ... ముందుగా ఈ స్టోరీ నాకు అభ‌య్‌, జ‌య్ వ‌చ్చి చెప్పారు. నేను క‌థ విన్నాక రెండురోజులు టైం అడిగాను. ఎందుకంటే ఇది చాలా క‌మ‌ర్షియ‌ల్ మూవీ వీళ్ళు తియ్య‌గ‌ల‌రా లేదా అని అనుమానపడ్డాను. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. డైరక్టర్ జ‌య్‌కి కూడా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత, నటుడు అభ‌య్ మాట్లాడుతూ... ఒక యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌గా నేను చేసే ఈ ప్ర‌య‌త్నానికి మంత్రి తలసాని, హీరో శ్రీ‌కాంత్ చాలా సాయం చేసారు. జ‌య్‌రాజ్ త‌ను కేవ‌లం డైరెక్ట‌ర్‌గా కాకుండా త‌న సొంత సినిమాలాగా చేశారు.  సినిమా విష‌యానికి వ‌స్తే ఇది ఒక మెడిక‌ల్ యాక్ష‌న్ మూవీ. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఈ చిత్రంలో మీరు చాలా కొత్త శ్రీ‌కాంత్ గారిని చూస్తారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్ ఉన్న చిత్ర‌మిది అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ఒక మ‌నిషి ఇంత ఈజీగా బ్ర‌తుకుతున్నాడంటే దానికి కార‌ణం ఒక సైంటిస్ట్‌. ఇందులోంచి వ‌చ్చిన క‌థే మార్ష‌ల్‌. న‌న్ను న‌మ్మిన అభ‌య్‌కి థ్యాంక్స్‌. అభ‌య్ లేక‌పోతే సినిమా లేదు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.