cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కాన్సెప్ట్‌ మూవీ 'భలే మంచి చౌక బేరమ్‌'

కాన్సెప్ట్‌ మూవీ 'భలే మంచి చౌక బేరమ్‌'

'భలే భలే మగాడివోయ్‌', 'మహానుభావుడు' రీసెంట్‌గా 'శైలజారెడ్డి అల్లుడు'తో వైవిధ్యమైన సినిమాలు అందిస్తున్న డైరక్టర్ మారుతి. ఒక ప్రక్క పెద్ద సినిమాలు చేస్తూనే.. మరో ప్రక్క చిన్న చిత్రాలకు కాన్సెప్ట్‌లు ఇస్తూ.. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ... సినిమాలు చేస్తున్నారు. 'ప్రేమకథా చిత్రమ్‌' 'రోజులు మారాయి' 'బస్టాప్‌' చిత్రాలు మారుతి కాన్సెప్ట్‌ ఇచ్చినవే'.

ఇవన్నీ సక్సెస్‌ అయి యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మారుతి కాన్సెప్ట్‌ అందించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌' ఆరోళ్ళ గ్రూప్‌ పతాకంపై శ్రీసత్య సాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ సమర్పణలో మురళికృష్ణ మడిదాని దర్శకుడిగా డా. ఆరోళ్ళ సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయ్యింది. కాగా హిట్‌ చిత్రాల దర్శకుడు మారుతి పుట్టినరోజు అక్టోబర్‌ 8. ఈ సందర్భంగా మారుతి మీడియాతో మాట్లాడారు.

''.. ఇదొక కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఫిల్మ్‌. నేను చెప్పిన ఐడియాని రవి ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసి డైలాగ్స్‌ రాశారు. 'రోజులు మారాయి' టీమ్‌ సెట్‌ అయ్యింది. మురళి డైరెక్టర్‌, బాల్‌రెడ్డి కెమెరా, జె.బి. మ్యూజిక్‌ అందరూ బాగా కష్టపడి చేశారు. దీనికి ఆరోళ్ళ గ్రూప్‌ సతీష్‌గారు స్టోరి నచ్చి సినిమా తీయడానికి ముందుకొచ్చారు. కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్‌కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక సీక్రెట్‌ కవర్‌ దొరుకుతుంది. వాళ్ళు దానిని ఎలా బేరం ఆడారు అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌.

''..కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ట్విస్ట్‌ వుంటుంది. సెకండాఫ్‌ అంతా సీరియస్‌గా సాగుతూ కన్‌ఫ్యూజన్‌ కామెడీతో వుంటుంది. పక్కా కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. చిన్న సినిమాలు కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ థియేటర్‌కి ఎవరూ రారు. సినిమాలు చూడాలి అంటే అందులో ఏదో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా వుండాలి. ఈ చిత్రంలో అలాంటి డిఫరెంట్‌ పాయింట్‌, ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయనివిధంగా వుంటుంది. తప్పకుండా అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు. మంచి మెసేజ్‌ కూడా ఈ చిత్రంలో వుంటుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ చూడాలి.

నవీద్‌, పార్వతీశం హీరోలుగా నటించారు. యామిని భాస్కర్‌ హీరోయిన్‌గా నటించింది. రాజా రవీంద్ర కీరోల్‌లో నటించారు. త్రూ అవుట్‌ సినిమా అంతా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ముస్తఫా అనే కొత్త విలన్‌ నటించారు. రాధామోహన్‌గారు మంచి టేస్ట్‌ వున్న నిర్మాత. 'భలే మంచి చౌక బేరమ్‌' ఫస్ట్‌కాపీ చూసి బాగా ఇంప్రెస్‌ అయి ఆయన ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా ప్రమోట్‌ చేస్తూ రిలీజ్‌ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నేను పెద్ద చిత్రాల మీదే నా కాన్‌సన్‌ట్రేషన్‌ చెయ్యాలనుకుంటున్నాను. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు అన్నారు మారుతి.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''మారుతి కాన్సెప్ట్‌ ఇచ్చిన 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రానికి నంబూరి రవి డైలాగ్స్‌ అందించారు. మురళి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూశాను. నాకెంతో నచ్చింది. టఫ్‌ కాంపిటీషన్‌లో కూడా కాన్ఫిడెంట్‌గా మంచి థియేటర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.

నూకరాజు, నవీద్‌, యామిని భాస్కర్‌, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. త్రూ అవుట్‌ ఫిల్మ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా హిలేరియస్‌గా వుంటుంది. కన్‌ఫ్యూజన్‌ కామెడీతో సాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.