cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

దర్బార్ యాక్షన్ థ్రిల్లర్-రజనీ

దర్బార్ యాక్షన్ థ్రిల్లర్-రజనీ

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్  ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 

ఇటీవల జరిగిన ఈ సినిమా ఫంక్షన్ లో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మాట్లాడుతూ - ``నాకు 70 ఏళ్లు వచ్చాయి. ఇంకా నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాన్నంటే  ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు, ప్రోత్సాహ‌మే కార‌ణం. ఇంత వ‌య‌సులోనూ ఇంత ఎన‌ర్జిటిక్‌గా ఎలా ఉన్నార‌ని కొంత మంది అడుగుతుంటారు. త‌క్కువ‌గా ఆశ‌ప‌డండి. త‌క్క‌వగా బాధ‌ప‌డండి.. త‌క్కువ‌గా భోజ‌నం చేయండి.. త‌క్కువ‌గా నిద్ర పోండి.. త‌క్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్ చేయండి, త‌క్కువ‌గా మాట్లాడండి.. ఇవ‌న్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 1976 తెలుగులో అంతులేని క‌థ విడుద‌లైంది. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉన్నారు. 

నేను చేసిన భాషా, ముత్తు, పెద‌రాయుడు, న‌ర‌సింహ‌, చంద్ర‌ముఖి, రోబో కేవ‌లం నాకోసమే ఆడ‌లేదు. మంచి సినిమాలు. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. అంద‌రూ సినిమా బాగా హిట్ కావాల‌నే చేస్తారు. అయితే సినిమా చేసే స‌మ‌యంలో ఓ మ్యాజిక్ జ‌రుగుతుంది. ఆ మ్యాజిక్ మ‌న చేతుల్లో ఉండ‌దు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జ‌రిగింది. మురుగ‌దాస్‌గారితో ప‌నిచేయాల‌ని 15 ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది.  ఈ క‌థ‌ను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగ‌దాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది..అన్నారు. 

దర్శకుడు మురుగ‌దాస్ మాట్లాడుతూ - ``నా కెరీర్‌లోనే ద‌ర్బార్ చాలా స్పెష‌ల్ మూవీ. ఎందుకంటే నేను 13 సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ర‌జినీకాంత్‌గారితో క‌లిసి చేసిన తొలి సినిమా ఇది. నేను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ. అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. 15 ఏళ్ల క్రితం ర‌జ‌నీకాంత్‌గారిని ఎలా చూశారో అదే స్పీడు, మాస్, స్టైల్ ఉన్న చిత్ర‌మిది '' అన్నారు. 

దర్శకులు మారుతి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, నిర్మాత బోగవిల్లి ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, కీలక పాత్రలో నివేదా థామస్,  విలన్ గా సునీల్ శెట్టి తదితరులు నటించారు.

70 ఏళ్ళు వచ్చినా హీరోగా చేస్తున్నా