cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

దర్శకుడిగా శ్రీధర్ సీపాన

దర్శకుడిగా శ్రీధర్ సీపాన

పలు ఫన్ మూవీస్ కు డైలాగులు అందించి పేరు తెచ్చుకున్న శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మూడు సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గీతా 2 (బన్నీవాస్), పీపుల్స్ మీడియా (టిజి విశ్వప్రసాద్) అభిషేక్ మూవీస్ (అభిషేక్ అగర్వాల్) కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు. 

‘విజేత’ వంటి ఓ కథాబలం కలిగిన చిత్రంతో వెండితెరకు కథానాయకునిగా పరిచయమయిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు ‘కళ్యాణ్ దేవ్‘ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. రచయిత ‘శ్రీధర్ సీపాన గతంలో   విక్టరీ వెంకటేష్ ‘నమో వెంకటేశ’, మహేష్ బాబు ‘దూకుడు’ వంటి చిత్రాలకు రచనా సహకారం అందించటం తో పాటు, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించారు. ’ 

ఈ సందర్భంగా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న ‘శ్రీధర్ సీపాన‘మాట్లాడుతూ...’ రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో ‘కళ్యాణ్ దేవ్‘ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రం గా దీనికి రూపకల్పన చేయటం జరిగింది అన్నారు. 

ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం లోని ఇతర నటీ నట, సాంకేతిక వర్గం  వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.