Advertisement


Home > Movies - Press Releases
డబుల్ ఫోజు.. డబుల్ కారు

ఈ మధ్య సినిమాలు వైవిధ్యంగా వుండడం కాదు, ప్రచారాలు కూడా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఏదో విధంగా జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న కృష్ణార్జున యుద్ధం సినిమా కోసం ఓ కొత్త తరహా ప్రచారానికి తెర తీసారు. సాధారణంగా ఈ మధ్య సినిమా స్టిల్స్ వగైరా వన్నీ ప్రింట్ తీయించి, దాంతో కారులు డెకరేట్ చేసి, తిప్పడం ప్రారంభించారు.

అయితే నాని డబుల్ రోల్ లో నటించిన కృష్ణార్జున యుద్ధం కోసం ఒక కారుకు బదులు రెండు కార్లు కలిపి డిజైన్ చేయించారు. అంటే ఒక కారు మీద మరో కారు వుంటుందన్నమాట. అలా ఒకదాని మదీ మరో కారు వుంచి, డిజైన్ చేయించి తిప్పుతున్నారు.

వింతగా చూస్తున్న జనాలకు, విషయం ఏమిటని అడిగితే, ఇదీ కాన్సెప్ట్, అంటూ సినిమాలో నాని డబుల్ రోల్ తదితర విషయాలను వివరిస్తున్నారు. కారుపై కారు వింతగా కనిపిస్తుంటే, ప్రచారం జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. ఓపెనింగ్స్ రావాలి అంటే సినిమా పెద్ద దయినా, చిన్న దయినా ఏదో హడావుడి చేయలి. తప్పదు.