cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

ఫ్యామిలీ మూవీ ఎబిసిడి-అల్లు శిరీష్

ఫ్యామిలీ మూవీ ఎబిసిడి-అల్లు శిరీష్

అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన‌ ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరికన్ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి' ట్యాగ్‌ లైన్‌.

సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా స‌క్సెస్‌ను యూనిట్ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన.. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ -

``నేడు సినిమా విడుద‌లైంది. మార్నింగ్ షోతోనే బ‌ల‌మైన ఓపెనింగ్స్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈవెనింగ్ షోతో త‌ర్వాతనే సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకున్నాం. ఏదైతే ముందుగా మేం క‌థ‌ను అనుకున్నామో, తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్‌ని క‌రెక్ట్‌గా సెట్ చేయాలి. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చేలా తీయాలని అనుకున్నామో. అది ఈరోజు నేర‌వేరింది.

శిరీష్ ఫెంటాస్టిక్‌గా న‌టించాడు.  అల్లు శిరీష్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. త‌నలో హ్యాపీనెస్ చూడాల‌నుకున్నాను. అది ఈరోజు నేర‌వేరింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ స్టోరీ, భ‌ర‌త్, వెన్నెల‌కిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయ‌ని అంటున్నారు.  68%తో ఓపెనింగ్ అయిన ఈ సినిమా, 74% మ్యాట్నీకి పెరిగింది. సాయంత్రానికి అది 78% పెరిగింది. ఓ నిర్మాత‌గా చాలా సంతోషంగా ఉంది. త్వ‌ర‌లోనే పెద్ద స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హంచ‌బోతున్నాం`` అన్నారు. 

ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - `` మేం ఎక్క‌డ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని అనుకున్నామో, దానికి ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.  ఈ అవకాశం ఇచ్చిన మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డిగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌`` అన్నారు. 

అల్లు శిరీష్ మాట్లాడుతూ - ``ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాల‌కన్నా బెట‌ర్‌గా ఓపెన్ అయ్యింది.  నాకు మంచి సినిమా ఇచ్చిన మ‌ధుర శ్రీధ‌ర్‌గారికి, మంచి థియేట‌ర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుగారికి థాంక్స్‌. సంజీవ్ న‌న్ను  కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అంద‌రూ బాగున్నాన‌ని, బాగా చేశావ‌ని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం సంజీవ్‌కే ద‌క్కుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఏ సినిమాకు రాలేదు. సంజీవ్‌, రామ్‌తోట‌ల‌కు థాంక్స్‌. ఈ స‌మ్మ‌ర్‌లో ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ ఇది`` అన్నారు.