cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ ' గ్రీన్ ఛాలెంజ్

'ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ ' గ్రీన్ ఛాలెంజ్

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ల కార్యక్రమంలో భాగంగా ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ సభ్యులు  ప్రతి రోజు పండగే టీం తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మెహనన్ ,ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బంజారాహిల్స్ లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్ లో జరిగింది. 

ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వ హించాలి.  పర్యావరణం ని రక్షించుకోవడం అందరి బాధ్యత ’’ అన్నారు.రాశీ ఖన్నా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఇప్పుడు చాలా అవసరం.

పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత  అన్నారు.దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలి.అలాగే మరో ముగ్గురుచేత ఈ మొక్కలు నాటే కార్యక్రమం ని  చేపట్టేలా చూడలి. మా టీం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది’’అన్నారు.ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మేయర్ బొంతు రామ్మెహాన్, న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


×