cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఘనంగా ' దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ' దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'దేవ్'..  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న  విడుదల చేస్తున్నఈ చిత్రానికి, రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

ఈ సందర్భంగా దర్శకుడు రజత్ రవిశంకర్ మాట్లాడుతూ.. దేవ్ సినిమా లో హీరో క్యారక్టర్ అందరికి పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది.. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ గారికి , తెలుగులో రిలీజ్ చేస్తున్న మధుగారికి ధన్యవాదాలు.. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి..అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ , యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి..ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన నా టీం కి కృతజ్ఞతలు..హారిస్ జయరాజ్ మ్యూజిక్ చాల బాగా ఇచ్చారు.. అందరి కృషి తోనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.. సినిమా కి పనిచేసిన అందరి టెక్నిషియన్స్ కి చాల థాంక్స్ అన్నారు..     

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..ఈ సినిమా కు వస్తున్న ప్రీ రిలీజ్ రెస్పాన్స్ చూస్తే చాల సంతోషంగా ఉంది.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన.. చాల పవర్ ఫుల్ రోల్.. ఇండిపెండెంట్ వుమన్ క్యారెక్టర్...మీ అందరికి నా పాత్ర నచ్చుతుంది..   ఖాకీ టైం లోనే కార్తీ తో మంచి అనుబంధం ఏర్పడింది.. మళ్ళీ ఈ సినిమా కూడా ఖాకీ లాగే మంచి హిట్ అవుతుంది అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ప్రజెంట్ జనరేషన్ మూవ్ అవుతున్న జోనర్ లో ఓ సినిమా చేయాలనుకున్నాను.. దేవ్ సినిమా ఇప్పటి జనరేషన్ లో ఉన్న వారికి సరిగ్గా సూట్ అవుతుంది.. చాల అందమైన కథ దేవ్ సినిమా..  ఈ సినిమా కి అందరు కనెక్ట్ అవుతారు.. లవ్ అండ్ ఫ్రెండ్షిప్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది.. రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల ప్రేమకు  ఎలాంటి ఫ్రాబ్లమ్స్ ఎదురయ్యయనేదే సినిమా కథ.. డిఫరెంట్ కథ చేసిన ఫీలింగ్ ఉంది నాకు... కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. మళ్ళీ సక్సెస్ మీట్ లో మీ అందరిని కలుస్తాను అన్నారు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా