Advertisement


Home > Movies - Press Releases
గీత గోవిందం గీతం విడుదల

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా జిఎ 2 పిక్చర్స్  బ్యాన‌ర్ లో చేస్తున్న చిత్రం గీత‌గొవిందం. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి పాటగా "ఇంకేం ఇంకేం కావాలి" అనే మెలోడియస్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గోపి సుందర్  సంగీతం సమకూర్చారు. సిడ్ శ్రీరామ్ ఈ  పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. ఈ చిత్రం లో ఛలో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు.

గీతాఆర్ట్స్ లో  శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన  ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.   ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో... శ్రీ అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..  గీత‌గోవిందం. చిత్రం లో   గోవిందం క్యారెక్టర్ లో విజ‌య్ దేవ‌రకొండ సూప‌ర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటాడన్నారు.  అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. అని అన్నారు.