cloudfront

Advertisement


Home > Movies - Press Releases

గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ప్రారంభమైంది.  హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి సూపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్‌ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌రామ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, అనిల్‌ సుంకర, కె.కె. రాధామోహన్‌, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  గోపీచంద్‌ మాట్లాడుతూ - ఈ స్టోరి బాగా పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. 'గౌతమ్‌ నందా' తర్వాత సంపత్‌ ఒక సూపర్‌ స్క్రిప్ట్‌తో వచ్చారు. మళ్ళీ సంపత్‌తో వర్క్‌ చేయడం హ్యాపీ. తమన్నాతో ఫస్ట్‌టైమ్‌ సినిమా చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్‌ స్క్రీన్‌మీద బాగుంటుందని అనుకుంటున్నాను'' అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడుతూ - ''ఈరోజు ఈ మూవీ లాంచ్‌ అవడానికి వన్ టు 10 రీజన్స్‌ మా హీరో గోపీచంద్‌గారే. ఫస్ట్‌టైమ్‌ నేను ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా చేస్తున్నాను. గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నారు. తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. 25 మంది బ్యూటిఫుల్‌ ప్లేయర్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బలమైన కథతో, విజువల్స్‌తో, ఎమోషన్స్‌తో ఫస్ట్‌టైమ్‌ ఈ కథ చేస్తున్నాను'' అన్నారు.

మిల్కీబ్యూటి తమన్నా మాట్లాడుతూ - ''సంపత్‌నందిగారితో నా మూడో సినిమా. మంచి కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌. గోపీచంద్‌గారితో సినిమా చెయ్యాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మంచి టీమ్‌తో మంచి కథ కుదిరినందుకు హ్యాపీగా ఉంది'' అని అన్నారు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - ''అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. నవంబర్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ ఏప్రిల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

గోపీచంద్ కొత్త సినిమా ఫొటోస్ కోసం క్లిక్ చేయండి