cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ – తాప్సీ

ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ – తాప్సీ

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న హీరోయిన్ తాప్సీ. ఆనందోబ్రహ్మ తరువాత గేమ్ ఓవర్ అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడిన విశేషాలు.

ఫస్ట్ టైమ్

గేమ్ ఓవర్ సినిమాలో వున్న కాన్సెప్ట్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్.  ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా.. నా క్యారెక్టర్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా నాకు బాగా నచ్చింది.. అందుకే స్క్రిప్ట్ చదవగానే ఓకె చెప్పాను. ఏ లాంగ్వేజ్ అయినా ఓకె అన్నాను.

మూడు వంతులు వీల్ చైర్ లోనే

నా లైఫ్ లో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు.. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్ లో కూర్చొవడం.. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు.. 60 పర్సెంట్ ఈ సినిమాలో నేను వీల్ ఛైర్ లో ఉన్నాను.. షూటింగ్ లో చాలా భాగం నేను వీల్ ఛైర్ లోనే ఉంటాను. ఎందుకో ఏమిటో మీరు సినిమాలోనే చూడాలి. 

దొరికిన వాటిలో మంచివి

నిజానికి నాకు ఎక్కువ ఆప్షన్స్ దొరకలేదు.. దొరికిన వాటిలో మంచివి తీసుకుని, వాటిని నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది.. నాకు కూడా ఈ కథలు నచ్చాయి… మా డైరెక్టర్స్ కూడా చాలా బ్రిలియంట్.. వాళ్లే నాకు హీరోలు.. కానీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తాప్సీ ఇన్ గేమ్ ఓవర్ అని వార్తలు వచ్చాయి.. అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను.. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ నా పేరు పోస్టర్ లో రాలేదు. హిందీలో నామ్ షబానా అనే టైటిల్ రోల్ చేసినా కూడా అక్కడ పోస్టర్ లో పేరు వేయలేదు.. ఇది మాత్రం చాలా స్కేరీ గా ఉంది.. ఇప్పటి వరకూ నేను త్రీ లాంగ్వెజెస్ లో చేశాను.. చాలా లక్కీ.. కానీ నాకు ఇది అసలైన టెస్ట్.. కొంచెం నెర్వస్ గా ఉంది.

మంచి సినిమాలు రావాలని..

అవును.. నా నుండి మంచి సినిమాలు రావాలని ఆడియన్స్ కూడా కోరుకోవాలనుకుంటాను.. ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా కిక్ ఏముంటుంది.. ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా సినిమాలు తీసి మాత్రం ఉపయోగం ఏముంది.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తాం.. మ్యాగ్జిమమ్ నా సినిమా బాగా కలెక్ట్ చేయాలని ట్రై చేస్తా.. ఆడియన్స్ ఏదో నవ్వుకోడానికో.. ఏదో పాటల కోసమో రారు.. థ్రిల్ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు.. అయితే మనం వాళ్లను స్టోరీతో ఎంత ఎంగేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. గేమ్ ఓవర్ అలాంటిదే..

ఇది పక్కా పరీక్ష

ఒక యాక్టర్ కు ఇది నిజంగా పరీక్ష లాంటిది. 95 పర్సెంట్ నన్నే చూడాలి ఈ సినిమాలో మీరు.. నా పెర్ఫామెన్స్ తో మీరు రెండు గంటలు సినిమా చూడాలి.. మీకు ఆప్షన్ లేదు.. ఇది నాకు టెస్ట్ లాంటిది.

కమర్షియల్ మూవీస్ మిస్ 

ఎక్కువ కాదు.. కొంచెం మిస్ అవుతున్నా.. కమర్షియల్ మూవీ డెఫినేషన్ మారిపోయింది.. మంచి స్టోరీ ఉన్న మూవీ వస్తే గ్లామరస్ రోల్ చేయొచ్చు.. కానీ స్టోరీ కూడా ఉండాలి..

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు 

తమిళ్ లో ఒక సినిమా ఫైనల్ అయింది. గేమ్ ఓవర్ రిలీజ్ తరువాత ఆ సినిమా ప్రారంభం కానుంది. తెలుగులో రెండు మూడు స్టోరీలు విన్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ సంవత్సరానికి ఒక సినిమా మాత్రం పక్కా తీస్తా.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్