cloudfront

Advertisement


Home > Movies - Press Releases

`జెర్సీ- నా కేరీర్ బెస్ట్ మూవీ-నాని

`జెర్సీ- నా కేరీర్ బెస్ట్ మూవీ-నాని

జెర్సీ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపొతుందని హీరో నాని అన్నారు. ఆయన నటించిన జెర్సీ సినిమా ఈ నెల 19న విడుదుల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా మీట్ అరేంజ్ చేసింది. ఈ మీట్ లో చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాట్లాడుతూ ``ఏప్రిల్ 12న ఉద‌యం 9 గంట‌ల‌కు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. అదే వారంలో 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం. ఏప్రిల్ 19న అనుకున్న‌ట్టే సినిమాను విడుద‌ల చేస్తాం.  షూటింగ్ పూర్త‌యింది. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. శాటిస్‌ఫైడ్‌గా ఉంది. తెలుగు సినిమాలో కొత్త జోన‌ర్‌ని ఓపెన్ చేస్తున్నామ‌నే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం`` అని అన్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ``ఈ రోజు నుంచి వ‌చ్చే 10 రోజులు మ‌నం అంద‌రం క‌లుసుకుంటాం. ఈ రోజు నుంచి జెర్సీ ప్ర‌మోష‌న్స్ ను కిక్ స్టార్ట్ చేస్తున్నాం. నేను సినిమా కోసం త‌గ్గ‌లేదు. సినిమా చేయ‌డం వ‌ల్ల  త‌గ్గాను. క్రికెట్ ఆడి, దానికి ప్రాక్టీస్ చేసేట‌ప్పుడు నాకే తెలియ‌కుండా త‌గ్గాను. 36 ఏళ్ల వ‌య‌సులో ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తుండ‌టం వ‌ల్ల కాస్త లావ‌వుదామ‌ని అనుకున్నా. కానీ నాకే తెలియ‌కుండా త‌గ్గాను.

న‌న్ను నేను మ‌ర్చిపోయి ఇటీవ‌ల‌ ఈ సినిమా చూశా. 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ నానిని మ‌ర్చిపోయి, కేవ‌లం అర్జున్‌ని మాత్ర‌మే చూస్తారు. ఆర్టిస్టుగా నాకు ఎక్స్ ట్రీమ్ శాటిస్‌ఫేక్ష‌న్ వ‌చ్చింది. అంద‌రూ ఈ సినిమాకు క్రికెట్ ప్ర‌ధాన‌మ‌ని  అనుకుంటున్నారు. కానీ అంత‌కు మించిన స‌ర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోష‌న‌ల్ సినిమా. నేను ఇంత‌కు ముందు ఏ సినిమా చేసినా స‌రే... `ఇదే ఆఖ‌రి రోజు` అనే ఫీలింగ్ ఉండేది త‌ప్పితే, `అరే.. ఈ రోజు ఇది ఆఖ‌రి రోజా...` అని పెద్ద‌గా ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవ‌రో నాతో పాటు క‌లిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కి సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ వ‌చ్చింది.

నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఆఖ‌రి రోజు ఇంత బ‌రువుగా ఇంటికి వెళ్లింది `జెర్సీ` సినిమాకే.
`వీడు మా డైర‌క్ట‌ర్ ` అని చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఒక ద‌ర్శ‌కుడు దొరికాడు. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌లేదు. గౌత‌మ్ గురించి చెప్పాల‌నిపించింది. గౌత‌మ్ తొలిసారి వ‌చ్చి క‌థ చెప్పిన‌ప్పుడు, ఇందులో క్రికెట్ అనేది నీడ మాత్ర‌మే, కానీ ఎమోష‌న్ గొప్ప‌గా ఉంటుంది అని అర్థ‌మైంది.  సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రూ నానిని క్రికెట్ ప‌ర్స‌న్‌గానే చూస్తారు.

నా కెరీర్‌లో క్విక్‌గా... విన్న వెంట‌నే ఓకే చేసి, వెంట‌నే సెట్స్ మీద‌కు వెళ్లి, అనుకున్న ప్ర‌కారం విడుద‌ల‌కు వ‌చ్చిన సినిమా ఇది.అప్ప‌ట్లో 146 డేస్‌ టు గో అని ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశాం. దాని ప్ర‌కారం విడుద‌ల చేయ‌గ‌ల‌మా అని మ‌ధ్య‌లో అనుమానాలు వ‌చ్చాయి. కానీ విధి మ‌మ్మ‌ల్ని అనుకున్న తేదికే మీ ముందుకు తీసుకొచ్చి నిలిపింది. 

డాన్యుల్ క్రికెట్ అకాడ‌మీలో నేను ప్రాక్టీస్ చేశా. మా ఆఫీస్ ద‌గ్గ‌ర కాబ‌ట్టి, కంఫ‌ర్ట‌బుల్‌గా నేర్చుకున్నా. షూటింగ్‌లో ఒక సారి ముక్కు కూడా ప‌గిలి ప‌క్క‌కు వెళ్లింది. క్రికెట్ ప‌రంగా ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో, అంత డీటైలింగ్‌గా తెలుగులో వ‌చ్చిన తొలి సినిమా `జెర్సీ` అవుతుంది. సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌డా సినిమా కోసం ఆడిన‌ట్టు ఉండ‌దు.

ఈ సినిమా ప‌రంగా నాకు ప్ర‌తిదీ కొత్తే.  1986, 96, 2018 సంవ‌త్స‌రాల‌ను చూపించాం సినిమాలో. సాను, గౌత‌మ్ చేసిన గ్రౌండ్ వ‌ర్క్, స్టోరీ బోర్డ్ వంటివి ఆస‌మ్‌. ఇప్పుడున్న సిట్చువేష‌న్‌లో ఇలాంటి సినిమాను షూట్ చేయ‌డం చాలా క‌ష్టం.  అనిరుద్ సంగీతం చాలా ఇష్టం నాకు. అత‌నితో వెంట వెంట‌నే రెండు సినిమాల‌కు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్ర‌తిరోజూ  రాత్రి 6.30కి మొద‌లైతే ఉద‌యం వ‌ర‌కు చేసేవాళ్లం అని నాని వివరించారు.

ముఖ్యమంత్రి కాకుండానే జనాన్ని ఆకట్టుకోవడం ఒక చరిత్ర