cloudfront

Advertisement


Home > Movies - Press Releases

జూన్ 21న ఫ‌స్ట్ ర్యాంక్ రాజు

జూన్ 21న  ఫ‌స్ట్ ర్యాంక్ రాజు

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్ ర్యాంక్ రాజు. చేత‌న్ మ‌ద్దినేని, క‌శిష్ ఓరా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ కు ఇప్పటికే మంచి స్పంద‌న వచ్చింది. కన్నడంలో సూపర్ హిటై, మాంచి కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం ఆధారంగా ఈ సినిమాను తెలుగులో తయారుచేసారు. ఈజూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ప్రొడ్యూస‌ర్ మంజునాధ్ మాట్లాడుతూ... ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ కు, పాటలకు మంచి స్పందన వచ్చింది అన్నారు. మాతృక మాదిరిగానే తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని, అందరూ ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్యం చేసారు.

హీరోయిన్ కౌశిష్ మాట్లాడుతూ... మా టీజుర్‌ని పాట‌ల‌ని ఇంత బాగా హిట్ చేసినందుకు ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అదే విధంగా మా మూవీ కూడా మిమ్మ‌ల్ని అందరినీ త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా మా సినిమా చూసి మ‌మ్మ‌ల్ని అద‌రించాల‌ని మ‌న‌స్సూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 

ద‌ర్శ‌కుడు న‌రేష్ మాట్లాడుతూ... నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఫ‌స్ట్ ర్యాంక్ రాజు  ఈ చిత్రం ఒక వ్య‌క్తి జీవితంలో చ‌దువు వంద‌ ప‌ర్సెంట్ బుద్ధి జీరో ప‌ర్సెంట్  ఉంటే ఎలా బ్ర‌తుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి స‌మస్య‌లుంటాయి ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనే దాని పై క‌థ న‌డుస్తుంది. మ‌రో రెండు రోజుల్లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా మీ ముందుకు వ‌స్తుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ మంచి ఆర్టిస్టుల‌తో ఈ సినిమా మొత్తం చేశాము. మీరంద‌రూ మా సినిమాని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాము అన్నారు.

హీరో చేత‌న్ మాట్లాడుతూ... టీజ‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌కి చాలా హ్యాపీ. న‌న్ను ఎవరు ఎంత ట్రోల్ చేసిన ప‌ర్వాలేదు.  నేను అందులో నా పాత్ర‌ని మాత్ర‌మే చూసుకుంటాను. చిన్న సినిమాలు రిలీజ్ కావు అన్న‌ది చాలా పెద్ద‌ట్రాష్ అలా ఏమీ ఉండ‌దు. కంటెంట్ బావుంటే త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతాయి. నా గ‌త చిత్రం కూడా దిల్‌రాజుగారు రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 

మా ప్రొడ్యూస‌ర్ చాలా స్ర్టాంగ్ మ‌రియు క్యాప‌బుల్ ప‌ర్స‌న్‌. మా చిత్రం జూన్ 21న చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.  ద‌ర్శ‌కుడు మారుతిగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇండ‌స్ర్టీలో ఆయ‌న నాకు ఒక గాడ్ ఫాద‌ర్ లాంటి వారు. ఈ సినిమాకి ముందునుంచి సపోర్ట్ గా వున్నారని చేతన్ అన్నారు.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?