Advertisement


Home > Movies - Press Releases
కళ్యాణ్ రామ్ లవ్ స్టోరీ పూర్తి

నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. అది కూడా టాప్ స్టార్ టెక్నీషియన్లు పిసి శ్రీరామ్, జయేంద్రలతో కలిసి. పూర్తిగా లుక్ మార్చేసి, గెటప్ మార్చేసి, అసలు ట్రాక్ నే మార్చేసి, చేస్తున్న యూత్ ఫుల్ ప్రేమ కథాచిత్రమ్ 'నా నువ్వే' ఈ సినిమా షూటింగ్, పబ్లిసిటీ ఫొటో షూట్, డబ్బింగ్, ఇలా దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసుకుంది.

ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, పటాస్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చేసాను. ఎమ్మెల్యేలో కామెడీ ప్లస్ ఎమోషన్ చేసాను. ఇజంలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ట్రయ్ చేసాను. ఇప్పుడు తొలిసారి లవ్ జోనర్ లో చేస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రేమ కథా చిత్రాలు చేసాను కానీ, అవన్నీ ఓ ఫార్మాట్ లో వుండే, సినిమాటిక్ స్క్రీన్ ప్లే కథలు.

నా నువ్వే అలా కాదు, ఈకాలం యూత్ పల్స్ పట్టుకుని తయారుచేసిన కథ. జయేంద్ర, పిసి శ్రీరామ్ కలిసి చేసిన చిత్రీకరణ చూస్తుంటే నేనేనా అన్న అనుమానం నాకే కలిగింది. అంత అందంగా చూపించారు. చాలా వెనక్కు తీసుకెళ్లారు అనిపించింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథనాయిక. మే మూడో వారంలో విడుదలకు సిద్దమవుతోంది.