cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'క‌న‌బ‌డుట‌లేదు' ఫ‌స్ట్ లుక్

'క‌న‌బ‌డుట‌లేదు' ఫ‌స్ట్ లుక్

బాల‌రాజు ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ 'క‌న‌బ‌డుట‌లేదు'. ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను  ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా, హీరో స‌త్య‌దేవ్ ఆవిష్క‌రించారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌థానాయ‌కుడు  సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ కలిగించేలా వుంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని బాలరాజు తెలిపారు. 

యుగ్ రామ్, శశిత కోన‌, నీలిమ పెత‌కంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నారు. స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.మ‌ధు పొన్నాస్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సందీప్ బ‌ద్దుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ కుర్మాన ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు

 


×