cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కాంచన 3లో లారెన్స్ విశ్వరూపం

కాంచన 3లో లారెన్స్ విశ్వరూపం

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ  సౌత్ ఇండియా లో   బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా కాంచన 3 తెలుగు వెర్షన్ నిర్మాత ఠాగోర్ మధు మాట్లాడుతూ తెలుగు , తమిళ్  ప్రేక్షకులకి  రాఘ‌వ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్ గా, సెన్సేషన్ గా ఉంటుంది.   కాంచన సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు  ఆ సిరీస్ కు ఫ్యాన్ అయిపోయారు .  

ఇప్పుడు ఆయన నటించి దర్శకత్వం చేసిన  కాంచన 3 చిత్రం తన  కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు . కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథా బలంతో వస్తున్నాడు   ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220  రోజుల పాటు వర్క్ చేశారు .  తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో లారెన్స్  గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. ఆయన  లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నారు

ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న  తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు.. మా బ్యానర్ లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుంది అని నా గట్టి నమ్మకం... మాస్ కమర్షియల్ చిత్రాలు తీయటం లో సిద్ధహస్తుడు మన లారెన్స్ మరొక్కసారి తానెంటో ప్రూవ్  చేసుకున్నాడు. తప్పకుండా మా కంచన అన్ని వర్గాల  ఆకట్టుకుంటుంది. అన్నారు.