Advertisement


Home > Movies - Press Releases
కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త` సెన్సార్ పూర్తి

రాజ్ తరుణ్ హీరోగా తయారైన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాను ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు.

సెన్సారు పూర్తయిన సందర్భంగా నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ - ``2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోర‌కం-ఆడోర‌కం`  త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈసినిమాను మార్చి 3న విడుద‌ల చేస్తున్నాం.

బుర్రా సాయిమాధ‌వ్‌ సంభాష‌ణ‌లు, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, ఎం.ఆర్‌.వ‌ర్మ ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు ప్ల‌స్ కానున్నాయి. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ విలన్ గా న‌టించారు`` అంటూ వివరించారు.