cloudfront

Advertisement


Home > Movies - Press Releases

థ్రిల్లింగ్ హారర్‌ మూవీగా 'ఎంతవారలైనా'

థ్రిల్లింగ్ హారర్‌ మూవీగా 'ఎంతవారలైనా'

రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ 'ఎంతవారలైనా'. ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర  టీజర్‌ను  మంగళవారం హైదరాబాద్‌ గోల్డెన్‌ పార్క్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హంజాద్‌ విడుదలచేశారు.

ఈ సందర్భంగా.. నిర్మాత జి. సీతారెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌ మేట్‌, చిరకాల మిత్రుడు.  ఇది న్యూ జనరేషన్‌ హారర్‌ మూవీ. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు సినిమాకే హైలెట్‌.  ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం అని అన్నారు. 

దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ - ''ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కూడా కచ్చితంగా శిక్షార్హులే.. అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా ప్రొడ్యూసర్‌ సీతారెడ్డి కారణం. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్‌ సుక్కు. మూడు పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది.  సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది '' అన్నారు. 

గోల్డెన్‌ పార్క్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హంజాద్‌ మాట్లాడుతూ - '' సీతా రెడ్డి , గురు చిందేపల్లి నా ప్రాణ మిత్రులు వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎంతవారలైనా' మూవీ తప్పకుండా విజయం సాధించాలి'' అన్నారు. 

ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!