cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌' ప్రారంభం

'కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌' ప్రారంభం

రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై రీమేక్ ల స్పెషలిస్ట్  భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్‌'. ఈ చిత్రం ప్రారంభోత్సవం మార్చి 13న రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివాస గృహంలో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌నివ్వగా, ఈస్ట్‌ గోదావరి డిిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్‌ జరుగుతుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ  తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది'' అన్నారు. 

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ''విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ ఆల్రెడీ తమిళ్‌, మలయాళంలో సినిమాలు చేసినా ఫిమేల్‌ క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది.  రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే క్యారెక్టర్‌ చేస్తున్నాడు. అన్నారు. 

హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ మా తాత అమర్‌నాథ్‌గారు ఒకప్పటి హీరో, మా అత్తయ్య శ్రీలక్ష్మిగారు హాస్యనటిగా అందరికీ తెలుసు. మా నాన్న రాజేష్‌గారు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. మా ఫ్యామిలీలో అందర్నీ ఆదరించిన ప్రేక్షకులు నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.