cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కురుక్షేత్రంకు తెలుగునాట మంచి ఆదరణ

కురుక్షేత్రంకు తెలుగునాట మంచి ఆదరణ

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడుగా నటించిన కురుక్షేత్రం, భారతగాధను భారీలెవెల్లో, త్రీడీ సాంకేతికత, ఆధునికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించి తీసిన సినిమా ఇది. ఈ సినిమాను తెలుగులో కూడా డైరక్ట్ గా విడుదల చేసారు. ఒకప్పుడు త్రివిక్రమ్ దగ్గర అసోసియేట్ గా వుండి, ప్రస్తుతం హీరో బన్నీ దగ్గర స్టోరీ డిపార్ట్ మెంట్ వ్యవహారాలు చూస్తున్న సాయి, తెలుగు వెర్షన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. కన్నడ సినిమా నిడివి కన్నా పదిహేను నిమషాల నిడివిని తగ్గించి విడుదల చేయడం వెనుక వున్నది ఆయనే.

ఈ సినిమాకు తెలుగు నాట కూడా మంచి ఆదరణ లభిస్తున్న సందర్భంగా మేకర్లు తమ హర్షం వ్యక్తం చేసారు. త్రీడీలో తొలిసారిగా రోపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపడం పట్ల  కురుక్షేత్రం యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. కన్నడనాట ఈ సినిమా తొలి రోజు వసూళ్లు భారీ స్థాయి లో ఉన్నాయి అని  కన్నడ లో ఆల్రెడీ రికార్డు సెట్ చేసిన కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్ ని దర్శన్ కురుక్షేత్రం తో బ్రేక్ చేసారని తెలిపారు.

తెలుగులో కురుక్షేత్రం కలెక్షన్ ప్రస్తుతం స్టడీ గా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేస్తుందని సినిమా నిర్మాత మునిరత్నం ధీమా వ్యక్తం చేసారు.